Raghav Juyal: ‘జడల్’ వర్సెస్ ‘విక్రమ్ మాలిక్’.. ‘ది పారడైజ్’ నుంచి రాఘవ్ జుయాల్ ఫస్ట్ లుక్ భీభత్సం!

Raghav Juyal: న్యాచురల్ స్టార్ నాని – మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘ది పారడైజ్’. ‘దసరా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరి కాంబో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే సినీ ప్రేమికుల్లో, నాని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన రాఘవ్ జుయాల్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్ మోస్ట్ పవర్‌ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయనకు సంబంధించిన ‘విక్రమ్ మాలిక్’ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Also Read :  Koratala Siva: కొరటాల శివ బర్త్‌డే స్పెషల్: ఆగస్టు నుంచే బాలయ్య ‘NBK 112’ షురూ.. ‘దేవర 2’పై క్రేజీ అప్‌డేట్!

రాఘవ్ జుయాల్ రగ్గడ్ అండ్ ఇంటెన్స్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేస్తున్నాయి. గోల్డ్ చైన్స్, కర్లీ హెయిర్‌తో ఊర మాస్ అవతారంలో కనిపించిన ఆయన తీరు సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇప్పటికే ఈ చిత్రంలో నాని పాత్రకు సంబంధించిన మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్, స్టైలిష్ లుక్స్, ‘ఆయా షేర్’ సాంగ్ లోని డ్యాన్స్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జడల్ సామ్రాజ్యంలోకి అడుగుపెడుతున్న విక్రమ్ మాలిక్ పాత్రను పరిచయం చేయడంతో.. వెండితెరపై నాని వర్సెస్ రాఘవ్ జుయాల్ మధ్య వచ్చే మైండ్ బ్లోయింగ్ ఫేస్-ఆఫ్ సీన్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉండబోతున్నాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈసినిమాకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్న అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, శ్రీకాంత్ ఓదెల విజువల్ టేకింగ్, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ గ్రాండ్ మేకింగ్ వాల్యూస్ చూస్తుంటే.. ‘ది పారడైజ్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.