Prabhas : రాజాసాబ్‌ మరోసారి విడుదల వాయిదా ?


Prabhas : ప్రభాస్‌ నటిస్తున్న హారర్ ఎంటర్‌టైనర్ “ది రాజాసాబ్”పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత వింటేజ్ డార్లింగ్ ప్రభాస్‌ని చూసి అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా ఇప్పటికే వాయిదాలు ఎదుర్కొన్న నేపథ్యంలో డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన “దురంధర్” సినిమాను కూడా అదే డేట్‌కి అనౌన్స్ చేశారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో కొత్త సందేహాలు మొదలయ్యాయి.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

డిసెంబర్ 5న బిగ్ క్లాష్ ఫిక్స్..?
ఇప్పుడు ప్రశ్న – రణ్‌వీర్ టీమ్ అసలు ప్రభాస్ సినిమా డేట్ తెలిసే ఆ డేట్ ఫిక్స్ చేసిందా? లేక ‘రాజాసాబ్’ మళ్లీ వాయిదా పడే ఛాన్సెస్ ఉన్నాయా? సోషల్ మీడియాలో చర్చే వేరు. అభిమానులకు అయితే ఇక కంఫ్యూజన్ మొదలైంది. ఒకవేళ “రాజాసాబ్” వాయిదా పడితే ఇది ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఊహించలేని డిసప్పాయింట్ అవుతుంది. కానీ ఫిల్మ్ న్యూస్ వర్గాల సమాచారం మేరకు — ఈసారి వాయిదా పడే అవకాశం చాలా తక్కువ. అంటే… డిసెంబర్ 5న ప్రభాస్ వర్సెస్ రణ్‌వీర్ సింగ్ బాక్సాఫీస్ క్లాష్ కన్‌ఫర్మ్ అనే మాటే. ఇప్పుడు అసలు క్లాష్ ఎవరిది పై చేయి వేస్తుందో చూడాలి!