
WAR 2 : ‘వార్ 2’ చిత్రానికి 25వ నెంబర్‌కు ఓ ప్రత్యేకత ఉంది. భారతీయ సినీ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోలు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఈ ఏడాది తాము సినీ రంగంలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ అరుదైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసేందుకు, యశ్ రాజ్ ఫిలింస్ తమ స్పై యూనివర్స్‌లో నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ ట్రైలర్‌ను జూలై 25న విడుదల చేయబోతున్నారు. “ఇది ఇద్దరు గొప్ప స్టార్‌ల మధ్య ఓ లైఫ్‌టైమ్ పోరాటం. జూలై 25ను మీ క్యాలెండర్‌లో ప్రత్యేకంగా గుర్తుంచుకోండి” అంటూ యష్ రాజ్ ఫిలింస్ ప్రకటన విడుదల చేసింది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ భారీ మల్టీస్టారర్ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. హృతిక్, ఎన్టీఆర్ మధ్య జరిగే ఈ మాస్ క్లాష్‌ను ఆస్వాదించేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ANNOUNCEMENT🚨: #WAR2 trailer out on July 25th.#War2 is set to release in Hindi, Telugu & Tamil on August 14th in cinemas worldwide! @iHrithik | @tarak9999 | @advani_kiara | #AyanMukerji | #YRFSpyUniverse pic.twitter.com/PmWtPQSuTC
— Yash Raj Films (@yrf) July 22, 2025












