Narendra Modi : పశ్చిమ బెంగాల్ పర్యటనలో దీదీ పై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ


పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృష్ణానగర్ లో రోడ్ షో నిర్వహించారు. ఆ తరవాత కృష్ణానగర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. రెండు రోజుల పశ్చిమ బెంగాల్ పర్యటనలో 22 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.

Also Read :  TamilNadu Politics : అన్నామలై రాజీనామా బీజేపీకి కలిగే నష్టం ఇదే..

పశ్చిమ బెంగాల్ లోని ఈ అభివృద్ధి ప్రాజెక్టులలో విద్యుత్, పెట్రోలియం సంబంధిత ప్రాజెక్టులున్నాయని, ఇవి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాయన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యాచారాలు, అవినీతికి నెలవుగా మారిందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి లేదని, అవినీతి, వారసత్వ రాజకీయాలు పెరిగిపోయాయన్నారు. రానున్న ఎన్నికల్లో బిజేపి 400 పైగా స్థానాలకు కైవసం చేసుకుంటామని ప్రధాని మోడీ పేర్కొన్నారు.