
కరోనా పరిస్థితుల కారణంగా యూఏఈలో జరుగుతున్న మెగా క్రికెట్ లీగ్‌లో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోమవారం కోహ్లీసేనతో తొలి మ్యాచ్‌లో ఢీకొనబోతున్న సందర్భంగా పలువురు తెలుగు సెలబ్రిటీలు మన జట్టుకు శుభాకాంక్షలు చెప్పారు.
తొలుత టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ శుభాకాంక్షలు చెప్పగా తర్వాత బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు, టెన్నిస్ తార సానియామిర్జా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజహరుద్దీన్, యువ హీరో నాని, హాస్యనటుడు సునీల్ ప్రత్యేక వీడియోల్లో అభినందనలు తెలిపారు. తొలి మ్యాచ్‌లో గెలుపొందాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ జట్టు ఎక్కడ ఆడినా తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.









