అబిడ్స్ చర్మాస్ లో భారీ అగ్ని ప్రమాదం…

హైదరాబాద్ ఈ పేరు వింటేనే అంత హడల్ అవుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షలకు హైదరాబాద్ అసలు రంగు బయటపడింది. మొన్నటి వరకు హైదరాబాద్ ను అంత సేఫ్ అన్న ప్రజలు..ఇప్పుడు హైదరాబాద్ అంటేనే భయపడుతున్నారు. వర్షాల దెబ్బ నుండి ప్రజలు ఇంకా బయటపడ ముందుకే..తాజాగా హైదరాబాద్ లోని అబిడ్స్ లోని చర్మాస్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

నాల్గవ అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడటంతో ప్రజలు భయాందోళనతో ప్రజలు, సిబ్బంది బయటకు పరుగులు తీస్తున్నారు. షాట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు పోలీసులు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తుంది . కానీ భారీగా ఆస్థి నష్టం జరిగిందని పోలీసులు చెపుతున్నారు.