బాబ్రీ మసీదు కూల్చివేత… కొత్త డెడ్ లైన్

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పును వెలువరించేందుకు లక్నోలోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు సమయాన్ని పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఆగస్ట్ 31వ తేదీ వరకు సమయాన్ని పొడిగిస్తూ జస్టిస్ నారీమన్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

ఈ కేసులో బీజేపీ కీలక నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి తదితరులు ఉన్నారు. మసీదు కూల్చివేతకు సంబంధించి అయోధ్యలో రెండు కేసులు నమోదయ్యాయి. మసీదును కూల్చడంలో కుట్ర కోణం దాగుందనేది ఒక కేసు కాగా… మసీదును కూల్చాలంటూ జనాలను రెచ్చగొట్టారనేది రెండో కేసు. వీటితో పాటు మరో 47 కేసులు నమోదు కాగా… వాటన్నింటినీ కూల్చివేత కేసుతోనే జత చేశారు.