కరోనా ఆగేలా కనిపించడం లేదు

కరోనా వైరస్ ప్రభావం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ అన్నారు. అంతేగాక, ఈ వైరస్ మరింత విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఇప్పటికీ ఉందని చెప్పారు.

దీంతో ప్రజలు దీని బారినపడే అవకాశాలు మరిన్ని ఉన్నాయని తెలిపారు. కరోనా ఉద్ధృతికి అడ్డుకట్టపడాలని కోరుకుంటున్నామని చెప్పారు. కరోనాను అరికట్టడంలో పలు దేశాలు కాస్త పురోగతి సాధించాయని తెలిపారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

కాగా, వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా కృషి జరుగుతోందని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ చీఫ్‌ మైక్ రేయాన్ తెలిపారు.