తెలంగాణలో కొత్తగా 31 కేసులు


తెలంగాణ కేసులు ఇంకా పెరిగాయి. తెలంగాణలో ఇవాళ కొత్తగా 31 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో 30 జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం.

దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1163కు చేరింది. ఇప్పటి వరకు 30 మంది మరణించారు. ఇవాళ 24 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా 751 మంది ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం 382 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.