
కరోనా పుట్టినిల్లు చైనాలో ఆదివారం కొత్తగా 14 కరోనా కేసులు నమోదయినట్లు అక్కడి ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే వీరిలో 12 మందికి వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం ఆందోళన కలిస్తోందని అన్నారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు విదేశాల నుంచి రాగా, మరొకరికి స్థానికంగా వైరస్ సంక్రమించినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది.
దీంతో చైనాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,877కు చేరుకుంది. అలానే 4,633 మంది కరోనా బారినపడి మృతి చెందారు. ఇప్పటి వరకు 1,672 మంది కరోనా లక్షణాలతో విదేశాల నుంచి రాగా, వారిలో 451 మంది చైనాకు చెందిన వారని, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎన్‌హెచ్‌సీ తెలిపింది.









