విజయనగరంలో తొలి కరోనా మరణం

విజయనగరం జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 60ఏళ్ల మహిళ మృతిచెందినట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన ఈమె ఈ రోజు విశాఖలో మృతిచెందినట్టు తెలిపారు విజయనగరం జిల్లాలో ఇప్పటిదాకా నాలుగు పాజిటివ్‌ కేసులు ఉన్నాయి.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన మహిళ మరణించారు. ఆమె కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతోంది. డయాలసిస్‌ జరుగుతున్న క్రమంలోనే ఇటీవల ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.