కరోనాకి ఎబోలా మందు

కరోనాకి మందు లేదు. వ్యాక్సిన్ ఇంకా రాలేదు. ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే కొన్ని డ్రగ్స్ ట్రయిల్ అండ్ ఎర్రర్ ఆ వాడుతున్నారు. కాగా ఎబోలా వైరస్‌ చికిత్సలో ఉపయోగించిన యాంటీ వైరస్ డ్రగ్ ‘రెమ్ డెసివిర్’ .. కరోనా వైరస్ పై సమర్థవంతంగా పని చేయగలదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) సాలిడారిటీ ట్రయల్ లో ఇది తేలాల్సి ఉందని ప్రకటించింది. వెంటిలేటర్ పై ఉన్న ముగ్గురు పేషెంట్లలో ఇద్దరికి ఇది పని చేసిందని న్యూ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఓ అధ్యయయాన్ని ప్రచురించిందని తెలిపింది.