దేశంలో కొనసాగుతున్న కరోనా ఉదృతి


దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 3722 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 134 మరణాలు సంభవించాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 78,003కి చేరింది. ప్రస్తుతం 49219 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 26235 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

ఇక గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 1,495 కేసులు నమోదవ్వగా తమిళనాడులో 509, గుజరాత్‌లో 364, దిల్లీలో 359, రాజస్థాన్‌లో 200 కేసులు పెరిగాయి.