తెలంగాణలో కొత్తగా మరో 99 కేసులు

తెలంగాణలో కొత్తగా మరో 99 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో తెలంగాణ పరిధిలోనివి 87 కాగా.. మరో 12 మంది వలస కూలీలకు ఈ మహమ్మారి సోకింది.

ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 70 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,891కి చేరింది. ఇవాళ మరో నలుగురు మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు 1526 మంది డిశ్చార్జి అవ్వగా.. 1273 మంది చికిత్స పొందుతున్నారు.