78 జిల్లాల్లో కొత్త కేసులు లేవు


భారత్‌లో 24గంటల్లో 1409 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో మొత్తం 21,393 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. గత 28 రోజులకు పైగా 12 జిల్లాల్లో ఎక్కడా కొత్త కేసులు నమోదు కాలేదని చెప్పారు. అలాగే, గత 14 రోజుల్లో 78 జిల్లాల్లో కొత్త కేసులు రాలేదని తెలిపారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

దేశంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడినవారిలో 4257 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజుకు సుమారు 388 చొప్పున రికవరీ అవుతున్నారని తెలిపింది. దేశంలో రికవరీ రేటు 19.89 శాతంగా నమోదైందని హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.