చికెన్ ధర మండిపోతుంది బాసూ

మొన్నటి వరకు కరోనా భయంతో కోడి మాంసాన్ని ముట్టని ప్రజలు ఇప్పుడు తిందామన్నా ధరలు చూసి వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది. చికెన్ ధరలు గుండెలు గుభేల్‌మనిపిస్తున్నాయి. ఈసారి కిలో చికెన్ ధర ఏకంగా రూ. 257కు చేరుకుంది. గతంలో ఏ వేసవిలోనూ ధరలు ఈ స్థాయికి చేరుకోలేదు. ఒక్కసారి మాత్రం రూ. 246కు చేరుకుంది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

చికెన్ తింటే కరోనా వస్తుందన్న పుకార్లతో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో పౌల్ట్రీ పరిశ్రమ దారుణంగా నష్టపోయింది. ఫలితంగా తెలంగాణలో కోళ్ల పెంపకం 50 శాతానికి పడిపోయింది. అయితే ఇప్పుడు ధర మండిపోతుంది.