
కరోనా మహమ్మారి వైరస్ ఈ ప్రపంచంపై దండయాత్ర మొదలుపెట్టి కొన్ని నెలలే కావడంతో దీనికంటూ ప్రత్యేకంగా నిర్ధారణ విధానాలు కానీ, ప్రత్యేక ఔషధాలు కానీ లేవు. అందుబాటులో ఉన్న మందులు, చికిత్స విధానాలతో దీన్ని ఎదుర్కొంటున్నారు.
వైరస్ నిర్ధారణ కూడా ఇప్పటికే అమల్లో ఉన్న పద్ధతుల్లో చేస్తున్నారు. ఈ క్రమంలో గాంధీ నగర్ ఐఐటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కృష్ణప్రసాద్ ఓ ఆసక్తికర ఆవిష్కరణ చేశారు. ప్రొఫెసర్ కృష్ణప్రసాద్ నేతృత్వంలో ఐఐటీ పరిశోధకుల బృందం సరికొత్త సాఫ్ట్ వేర్ కు రూపకల్పన చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఈ సాఫ్ట్ వేర్… ఛాతీ ఎక్స్ రేలను పరిశీలించి కరోనా ఉందో లేదో గుర్తిస్తుంది. ఈ సాఫ్ట్ వేర్ ను పొందుపరిచి కృష్ణప్రసాద్ బృందం ఓ వెబ్ సైట్ (http://covidxray.iitgn.ac.in) రూపొందించింది. ఈ వెబ్ సైట్ లో ఛాతీ ఎక్స్ రేని అప్ లోడ్ చేస్తే చాలు… దీంట్లో సాఫ్ట్ వేర్ కృత్రిమ మేధ సాయంతో ఆ ఎక్స్ రేని విశ్లేషించి కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తిస్తుంది.









