
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు వందల సంఖ్య లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా తీవ్రత భారీ స్థాయి లో ఉంది. ఇక తాజాగా గాంధీ హాస్పిటల్కు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. హాస్పిటల్ కారిడార్లో ఇద్దరు మహిళలు పీపీఈ కిట్లు ధరించి ఫ్లోర్ మీద పడుకొని ఉన్న వీడియో ఇది.
లిఫ్ట్ ఎక్కడానికి అటుగా వెళ్తున్న వ్యక్తి పాజిటివ్వా వీళ్లు అని ప్రశ్నించడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. మరో వ్యక్తి దూరంగా నిలబడి ‘‘మీకు ఏమైందమ్మా..? ఏ ఊరి నుంచి వచ్చారు..? ఏ బస్తీ మీది’’ అని హిందీలో ప్రశ్నించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో విపరీతంగా షేర్ అవుతుంది. గాంధీ హాస్పిటల్లో పరిస్థితులు ఇలా ఉన్నాయంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
This is the current situation of Gandhi hospital ??#TelanganaCovidFailure pic.twitter.com/2zqrnKwmea
— J D (@jyojyo88950593) July 4, 2020









