మందు కోసం మహిళల పడిగాపులు

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు ప్రియులు తట్టుకోలేకపోయారు. బ్లాక్ లో వేలు పోసి మద్యం కోలుగోలు చేసారు. మరికొంతమంది మద్యం దొరకక పోవడం తో పిచ్చోళ్ళు అయ్యారు. ఇక సోమవారం నుండి అన్ని జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభం మొదలు కావడం తో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

కేవలం మగవారే కాదు మహిళలు సైతం మందు కోసం గంటలకొద్దీ లైన్లో నిలబడడం షాక్ కు గురి చేస్తుంది. హైదరాబాద్‌లో కొన్ని వైన్స్‌ల ఎదుట.. మహిళలు, అమ్మాయిలు క్యూలైన్లలో నిలబడ్డారు. తెల్లారకముందే వైన్స్‌ల వద్ద మందు బాబులు భారీ సంఖ్యలో క్యూలైన్లలో నిలబడగా.. తామేం తక్కువ అంటూ.. కొండాపూర్‌లోని ఓ వైన్స్‌ ముందు మందుబాబులకు పోటీగా అమ్మాయిలు కూడా ఉదయాన్నే వచ్చి లైన్‌లో నిల్చున్నారు. సామాజిక దూరం పాటిస్తూనే మొహాలకు మాస్కులతో అమ్మాయిలు మందు కోసం పడిగాపులు కాసి.. ఆ తర్వాత లిక్కర్ తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.