దేశంలో హాట్‌స్పాట్స్‌ ఎన్నో తెలుసా ?

దేశవ్యాప్తంగా 170 జిల్లాలు కరోనా వ్యాప్తికి హాట్‌స్పాట్స్‌ గా గుర్తించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 207 జిల్లాలను నాన్‌ హాట్‌స్పాట్‌ జిల్లాలుగానూ, మిగిలినవి గ్రీన్‌జోన్‌లోనూ ఉన్నట్లు పేర్కొంది. ఏప్రిల్‌ 20 తర్వాత హాట్‌స్పాట్‌ కాని ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. భారత్‌లో ఇప్పటి వరకు సామూహిక సంక్రమణ వ్యాప్తి స్థాయికి కరోనా వైరస్‌ చేరలేదని, కొన్ని చోట్ల స్థానిక వ్యాప్తి మాత్రమే ఉందని వెల్లడించారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1076 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని, దీంతో దేశం మొత్తంమీద కేసుల సంఖ్య 11,439కి చేరిందని తెలిపారు. ఇప్పటి వరకు 377 మంది ప్రాణాలు కోల్పోగా.. వైరస్‌ బారిన పడిన వారిలో 11.41 శాతం మంది కోలుకున్నారని తెలిపారు.