
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 03 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుంది. ఈసారి కరోనా వైరస్ కారణంగా యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబీ స్టేడియాల్లో మాత్రమే మ్యాచ్లు జరగనున్నట్లు తెలిపారు. లీగ్ స్టేజ్లో మొత్తం 46 మ్యాచ్లు జరుగుతాయి.
తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19 సాయంత్రం 07.30కి అబుదాబి వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఇక హైదరాబాద్ తన తొలి మ్యాచ్ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో ఆడనుంది. మిగతా మ్యాచ్ల విషయానికి వస్తే..
- సెప్టెంబర్ 19 న మొదటి మ్యాచ్ అబుదాబీలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, గతేడాది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ తలబడనున్నాయి.
- సెప్టెంబర్ 20 రెండో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వెర్సస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య దుబాయ్లో..
- సెప్టెంబర్ 21 మూడో మ్యాచ్ సన్ రైజర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతుంది.
- సెప్టెంబర్ 22 రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్తోొ ఐపీఎల్ యాక్షన్ షార్జాకు షిఫ్ట్ అవుతుందని బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్ల డేట్స్ వివరాలను మాత్రమే విడుదల చేయగా.. మరికొద్ది రోజుల్లో ప్లేఆఫ్ మ్యాచ్లు, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ను ప్రకటించనుంది.









