చిగురిస్తున్న ఐపీయల్ ఆశలు

ఐపీఎల్ పై అభిమానుల్లో ఆశలు పెరుగుతున్నాయి. టీ20 ప్రపంచకప్ నిర్వహణ ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదంటూ ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. దీంతో అదే సమయంలో ఐపీఎల్‌ నిర్వహించడంపై బీసీసీఐ ఆలోచిస్తోంది. టీ20పై ఏదో ఒకటి తేలిన తర్వాత ఐపీఎల్ నిర్వహణపై ఆలోచిస్తామని బీసీసీఐ ఇది వరకే పేర్కొన్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

అయితే పూర్తిస్థాయిలో, లేదంటే కుదించి అయినా నిర్వహించాలని కోరుతున్నాయి. అంతేకాదు, భారత్‌లో కనుక కుదరకుంటే విదేశాల్లో అయినా నిర్వహించాలని పేర్కొన్నాయి. లీగ్ పరిధి విషయంలో బీసీసీఐ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమాని నెస్ వాడియా పేర్కొన్నారు.