వాట్సప్ లో షాపింగ్ .. జియో మరో అడుగు

ఫేస్‌బుక్‌తో జట్టుకట్టిన రిలయన్స్‌ రిటైల్‌.. వాట్సాప్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా జియో మార్ట్‌ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతం ముంబయి పరిసరాల్లోని నవీ ముంబయి, ఠానే, కల్యాణ్‌ ప్రాంతాల్లోనే ఈ సేవలు లభ్యమవుతున్నాయి. ఇందుకోసం వాట్సాప్‌ వినియోగదారులు 88500 08000 నంబర్‌ను తమ ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read :  హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

ఆ నంబర్‌కు మీరు మెసేజ్ పంపితే జియో మార్ట్‌ నుంచి మీ ఫోన్‌కు లింక్‌ వస్తుంది. అది కేవలం 30 నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా మీకో పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో మీ వివరాలు నమోదు చేసుకొని షాపింగ్ చేసుకోవచ్చు. షాపింగ్ తర్వాత గ్రాసరీ నేరుగా ఇంటి వస్తుంది.