
కరోనాపై జరిగిన పోరులో చైనా విజయం సాధించిందని.. దీన్ని నియంత్రించిన తీరు అభినందనీయమంటూ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు తాజాగా ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఓ సందేశాన్ని పంపారు. అంతేకాకుండా జిన్‌పింగ్ ఆరోగ్యంగా ఉండాలని కిమ్ ఆకాంక్షిస్తున్నట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది.
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచదేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2లక్షల 68వేల మందిని పొట్టనపెట్టుకుంది. మరో 38లక్షల మంది దీనికి బాధితులుగా మారారు.









