
లాక్డౌన్ కారణంగా వాహనాల సంచారం కాస్త తగ్గడంతో అటవీ జంతువులు యథేశ్చగా తిరుగుతున్నాయి. ఈక్రమంలో రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి సమీపంలోని కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై కాటేదాన్ అండర్ బ్రిడ్జి వద్ద స్థానికులు చిరుతను గుర్తించారు.
ఎన్హెచ్-7 ప్రధాన రహదారిపై గాయపడిన చిరుతను స్థానికులు గుర్తించారు. గాయాల కారణంగా చిరుత ఎటూ కదలలేని పరిస్థితి. ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రహదారిపై రాకపోకలను నియంత్రించారు. చిరుతను చూసేందుకు జనం భారీగా గుమికూడారు.









