కసి.. ఆర్థిక వ్యవస్థపై మందుబాబుల కసి


లాక్‌డౌన్‌ కారణంగా మద్యం ప్రియులు ఇన్నాళ్లు విలవిల్లాడిపోయారు. తాజాగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కంటైన్‌మెంట్‌ జోన్లు తప్ప మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి మద్యం ప్రియులు దుకాణాల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరారు.

Also Read :  రూ.2 లక్షలతో నీటి సదుపాయం… ప్రభుత్వ పాఠశాలలకు అండగా ‘కైండ్ ఇండియా’

గుంటూరు జిల్లా బెల్లంకొండ ప్రాంతంలో ఉదయం దుకాణాలు తెరవక ముందే మందుబాబులు పడిగాపులు కాశారు. ఐతే ఈ లైన్స్ చూసి సరదా కామెంట్స్ వినిపించాయి. ”కసి.. దేశ ఆర్ధిక వ్యవస్థని గాడిలో పెట్టాలని ముందుకు వచ్చిన మందు బాబులు” అంటూ నవ్వులు పూయించారు నెటిజన్స్.