ప్రైవేట్ రైళ్ళుకు గ్రీన్ సిగ్నల్

భార‌తీయ రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక భారతీయ రైల్వే పరిధిలో ప్రైవేటుగా ప్రయాణికుల రైళ్లు కూతపెట్టనున్నాయి. రైళ్లు, రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణకు సంబంధించిన ప్లానింగ్స్ అఫిషియ‌ల్ గా వెలువ‌రించింది. ఈ మేరకు 109 రూట్ల‌లో 151 మోడ‌ర‌న్ ట్రైన్స్ రాకపోకల కోసం ప్రైవేట్ ఇన్వెస్ట్ మెంట్స్ ఆహ్వానించినట్టు అనౌన్స్ చేసింది.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

తొలిసారి శ్రీకారం చుడుతున్న ఈ విధానం ద్వారా ప్రైవేటు రంగం నుంచి రూ.30వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని రైల్వే అంచనా. ఎక్కువ రైళ్లు భారత్‌లోనే తయారవుతాయని ఆశిస్తోంది. ఒకసారి అర్హత సాధించిన తర్వాత అందుకు అవసరమైన ఆర్థిక వనరులు, రైళ్ల సమీకరణ, నిర్వహణ వంటివన్నీ ప్రైవేటు వారే చూసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా 151 రైళ్లను గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసేలా డిజైన్‌ చేయాలని రైల్వేశాఖ షరతు విధించింది. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గుతుందని పేర్కొంది.