ఈ డైరెక్టర్ పోలీసులకు ఎంత హెల్ప్ చేసాడో తెలుసా..?

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాల దేశాలు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. ఈ సమయంలో వారి ప్రాణాలు లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడడం లో కీలక పాత్ర పోషిస్తున్న డాక్టర్స్ , పోలీస్ , పారిశుధ్య కార్మికులకు అంత సెల్యూట్ చేస్తున్నారు.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

లాక్ డౌన్ సమయంలో రాత్రింబవళ్లు పోలీసులు విధులు నిర్వహిస్తూ నిబంధనలు అమలయ్యేలా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికీ ఏదో ఓ సాయం చేయాలనుకున్న డైరెక్టర్ రోహిత్ శెట్టి వారి కోసం 8 హోటల్స్ బుక్ చేసాడు. అందులో పోలీసులు రెస్ట్ తీసుకోవడానికి, స్నానం చేయడానికి, అలానే బ్రేక్ ఫాస్ట్, లంచ్ వంటివి చేసుకోవడానికి ఈ హోటల్స్ ఉపయోగించుకోవచ్చని తెలిపారు.