సారా ను ఇలా కూడా తయారుచేస్తారా..ఓరి దేవుడో..

గత నెల రోజులుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కావడం తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాలలో తినడానికి తిండి కూడా దొరకడం లేదు. దీంతో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. వీరి సంగతి ఇలా ఉంటె మద్యం ప్రియులు మద్యం దొరకకపోవడం తో ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. మరికొంతమంది బ్లాక్ లో వేలు పెట్టి కూడా మద్యం తీసుకుంటున్నారు. మద్యం బాబుల డిమాండ్ చూసి కొంతమంది కల్తీ సారా ను తయారుచేయడం స్టార్ట్ చేస్తున్నారు.

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

కరోనా సోకకుండా చేతులకు రాసుకొనే శానిటైజర్ తో కొంతమంది సారా తయారు చేయడం అందర్నీ షాక్ లో పడేస్తుంది. అనంతపురం జిల్లాలో ఓ మెడికల్ రిప్రజెంటేటివ్, మరో ముగ్గురితో కలిసి శానిటైజర్ తో సారా తయారు చేసి అమ్ముతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులతో కలిసి ఓ వ్యక్తిని సారా కొనుగోలు చేసేందుకు పంపించి రెడ్ హ్యాండెడ్ గా అతడిని పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 18 శానిటైజర్ సీసాలను, సారా బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.