కేంద్రం, ఆర్బీఐకి సుప్రీం నోటీసులు

లాక్ డౌన్ కారణంగా మధ్య తరగతి ప్రజలు, బలహీన వర్గాల ప్రజలకు ఊరట కలిగించే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధించిన సంగతి తెలిసిందే.

అయితే, ఆ మారటోరియం ప్రకటన స్థిరాస్తి రంగానికి కూడా వర్తిస్తుందా? అనే విషయంలో స్పష్టత లేదని, దీనిపై తగిన వివరణ అవసరమని భావిస్తున్నామని భారత స్థిరాస్తి రంగ అభివృద్ధి సంస్థ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ సుప్రీంలో విచారణ చేపట్టారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని ధర్మాసనం వాదనలు విన్న అనంతరం కేంద్రానికి, ఆర్బీఐకి నోటీసులు జారీచేసింది. మారటోరియం ఎవరెవరికి వర్తిస్తుందో చెప్పాలని కోరింది. తదుపరి విచారణ రెండు వారాలు వాయిదావేసింది