శ్రీవారి లడ్డూ అమ్మకాలు షురూ

తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ రోజు ఉదయం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన అమ్మకాలు షురూ అయ్యాయి.

వీటిని ప్రధాన పరిపాలన భవనం వద్ద వీటికి అమ్ముతున్నారు. లాక్‌డౌన్‌ వల్ల 55 రోజుల పాటు శ్రీవారి లడ్డూలను మళ్లీ భక్తులు పొందే అవకాశం లభించింది. లడ్డూ విక్రయాలు ప్రారంభమయ్యాయని తెలుసుకున్న భక్తులు ఈ రోజు వాటి కోసం భారీగా తరలివచ్చారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

కరోనా విజృంభణతో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే స్వామి వారి నిత్య కైంకర్యాలను మాత్రం అర్చకులు నిర్వహిస్తున్నారు.