బీహార్ నుంచి తెలంగాణకు వలస కూలీలు


తెలంగాణ నుంచి ఇప్పటికే పలు శ్రామిక్ రైళ్లు ఝార్ఖండ్, బీహార్‌ సహా పలు రాష్ట్రాలకు వెళ్లాయి. ఐతే శుక్రవారం మాత్రం అరుదైన దృశ్యం ఆవిష్కతమైంది. వలస కార్మికులంతా సొంతూళ్లకు వెళ్తుంటే.. బీహార్ నుంచి వలస కార్మికులు మాత్రం తిరిగి తెలంగాణ బాటపట్టారు.

Also Read :  స్టార్ శక్తి ఉత్సవ్‌లో పాల్గొన్న సురేఖ కొణిదెల, సుష్మిత కొణిదెల

వీరంతా హైదరాబాదులోని లింగంపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. వీరిని రాష్ట్రంలోని కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల, సిద్ధిపేట, కామారెడ్డి, మంచిర్యాల, మిర్యాలగూడ, సుల్తానాబాద్ తదితర జిల్లాలకు ప్రత్యేక బస్సుల్లో ప్రభుత్వం తరలిస్తోంది. అందరీకి వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం రైసు మిల్లులకు తరలించనున్నారు.