వుహాన్‌ లో సున్నా కేసులు


ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా పుట్టినిల్లు వుహాన్‌ నగరంలో ఒక్క కరోనా కేసు కూడా లేదని అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారందరూ కోలుకున్నారని, అందరినీ ఇంటికి పంపేశారట. ‘ఏప్రిల్‌ 26 వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వుహాన్‌లో కరోనా కేసుల సంఖ్య సున్నా. స్థానికులు, వైద్య సిబ్బంది సమష్టి కృషితో ఇది సాధ్యపడింది’ అని చైనా వర్గాలు వెల్లడించాయి

Also Read :  హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచమే సంక్షోభంలో పడిన నేపథ్యంలోచైనా వ్యవహరించిన తీరుపై స్వతంత్ర దర్యాప్తు జరపాల్సిందేనని కొన్ని దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. . వుహాన్‌ నగరంలో తొలుత బయటపడ్డట్లు భావిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సమయంలో చైనాపై వస్తోన్న ఆరోపణలను కొందరు సమర్ధిస్తున్నారు. కరోనా వైరస్ మనిషి చేతిలో రూపుదిద్దుకున్న వైరస్ అని, ఎయిడ్స్ కు వ్యాక్సిన్ తయారుచేసే ప్రయత్నంలోనే ఈ మహమ్మారి ఉద్భవించిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.