
Naga Chaitanya: టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య డిజిటల్ ఎంట్రీ ఇస్తూ నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ధూత’. ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ మైండ్ బెండింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే ఈ సిరీస్ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అక్కినేని అభిమానులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. మోస్ట్ అవేటెడ్ ‘ధూత సీజన్ 2’ (Dhootha 2) అఫీషియల్‌గా స్టార్ట్ అయ్యింది.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నాగచైతన్య ఒక ఎమోషనల్ అండ్ క్రేజీ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సీక్వెల్‌తో ఆయన నటుడిగానే కాకుండా, తన కెరీర్‌లో ఫస్ట్ టైం నిర్మాతగా సరికొత్త అవతారమెత్తబోతున్నారు. “‘ధూత’ రెండవ అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాను. అలాగే నిర్మాతగా ఇది నా మొదటి అడుగు. సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయడానికి అంతా రెడీ అయ్యింది” అంటూ చైతన్య తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘అన్నపూర్ణ స్టూడియోస్’, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత శరత్ మరార్‌లతో కలిసి నాగచైతన్య స్వయంగా నిర్మించనున్నారు. ఒరిజినల్ వెర్షన్‌లో నటించిన పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ ఈ సీక్వెల్‌లోనూ కీలక పాత్రల్లో కనిపించనుండగా, ఇషాన్ ఛాబ్రా దీనికి సంగీతం అందించనున్నారు. ఫస్ట్ సీజన్ సృష్టించిన ఇంపాక్ట్‌తో ఇప్పుడు రాబోయే పార్ట్-2పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Auspicious beginnings as I step into the second chapter of Dhootha and my first step as a producer . Onwards and upwards . Here’s to the magic ahead . #dhootha2 @Vikram_K_Kumar @AnnapurnaStdios @nseplofficial @sharrath_marar @Padmak131 @PrimeVideoIN @parvatweets @priya_Bshankar… pic.twitter.com/cReG7A4mbi
— chaitanya akkineni (@chay_akkineni) June 5, 2026









