
తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5
రాస్తా ఫిల్మ్స్, ఔరా ఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా సంయుక్తంగా రూపొందించిన ‘గోపి గాళ్ల గోవా ట్రిప్’ ఓ చిన్న కథను ఫ్రెష్ టచ్‌తో స్క్రీన్‌పై అందించింది. సాయి కుమార్, సీతా రామరాజు, రమణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రోహిత్ & శశి దర్శకత్వం వహించారు. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రోడ్ ట్రిప్ బ్యాక్‌డ్రాప్‌తో సాగుతుంది.
కథ : తెలంగాణ గద్వాల్ జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో టెంట్ సామాను షాప్ నడిపే ఇద్దరు గోపీలు తమ జీవితంలో ఒక్కసారి అయినా గోవా వెళ్లాలి అనుకుంటారు. అయితే ఆ ట్రిప్ వాళ్ల లైఫ్‌ను ఎలా మార్చింది? మార్గమధ్యంలో వారికి పరిచయమైన మరో గోపి ఎవరు? గోవాలో వీళ్లు ప్లాన్ చేసిన పని పూర్తయ్యిందా? తిరిగి వాళ్ల ఊరికి ఎలాంటి అనుభవాలతో చేరుకున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం తెరపై ఆసక్తిగా నడుస్తుంది.
విశ్లేషణ : సినిమా కథ ఒక్క లైన్లో చెప్పుకునేంత సింపుల్ అయినా, దర్శకులు దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ మాత్రం పూర్తిగా ఫ్రెష్. చాలా ఇంగ్లీష్ రోడ్ మూవీస్‌లో కనిపించే టేకింగ్ స్టైల్ ఈ సినిమాలో కనిపిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ఫీల్ వచ్చేలా కెమెరా వర్క్, లొకేషన్ సెట్టింగ్స్, షాట్ డిజైన్ అన్నీ క్లీన్‌గా, నేచురల్‌గా మలిచారు. ప్రత్యేకంగా గోవా బీచ్ సీన్ — ఫ్లూట్ ప్లే చేస్తూ ఉండగా ఎదురు నుంచి బ్లూ కలర్ ఆవు నడుస్తూ వెళ్లే షాట్… అది కేవలం అందమైన విజువల్ మాత్రమే కాదు, కృష్ణుడిని సింబాలిక్‌గా హైలైట్ చేసే ఆర్టిస్టిక్ మోమెంట్. ఆ సీన్ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ జెట్ స్పీడ్‌లో సాగేలా నిర్మించగా, సెకండ్ హాఫ్‌లో కథను కాస్త డెప్త్‌తో మలిచారు. షాట్ మేకింగ్, షాట్ డివిజన్, ఎడిటింగ్ లాంటి టెక్నికల్ డిపార్ట్మెంట్స్ మొత్తం దర్శకుల ప్రత్యేక అభిరుచిని స్పష్టంగా చూపిస్తాయి.
ఎవరెలా చేశారంటే : అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం వంటి నటులు తక్కువ పాత్రలతో ఉన్నప్పటికీ, తమ పాత్రలకు న్యాయం చేశారు. రూట్ ఫిల్మ్ జానర్లో కొత్తదనం చూపించిన ఈ చిత్రం, టాలీవుడ్ కథను హాలీవుడ్ స్టైల్ మేకింగ్‌తో ప్రెజెంట్ చేస్తూ రిఫ్రెషింగ్ ఫీల్ ఇస్తుంది.
Overall : ఫ్రెష్ మూవీస్ ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చే మస్ట్ వాచ్ రూట్ జర్నీ.
తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5









