రివ్యూ : శంబాల | Shambhala Movie Review

Shambhala Movie Review
Shambhala review

తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5

సాయికుమార్ నట వారసుడిగా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన ఆది సాయికుమార్, హీరోగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ చెప్పుకోదగ్గ భారీ హిట్ కోసం ఇంకా ఎదురుచూస్తున్నాడు. అలాంటి సమయంలో ఆయన నుంచి వచ్చిన తాజా చిత్రం “శంబాల”. మిస్టిక్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కథపై నమ్మకంతో యూనిట్ ముందుగానే ప్రీమియర్స్ కూడా వేసింది.

కథ 1980లో ప్రారంభమవుతుంది. శంబాల అనే చిన్న గ్రామంలో ఆకస్మికంగా ఒక ఉల్క పడటంతో అక్కడ విచిత్రమైన ఘటనలు మొదలవుతాయి. గ్రామస్తులు మూఢనమ్మకాలతో జీవిస్తూ, వరుస హత్యల భయంతో వణుకుతుంటారు. ఈ ఉల్కపై పరిశోధన చేయడానికి కేంద్ర ప్రభుత్వం జియో సైంటిస్ట్ విక్రమ్‌ (ఆది సాయికుమార్)ను ఆ గ్రామానికి పంపుతుంది. శాస్త్రాన్నే నమ్మే విక్రమ్, ఆ ఊరిలో జరుగుతున్న సంఘటనలకు కారణం సైన్సేనా లేక శాస్త్రమా అనే సందేహాల మధ్య చిక్కుకుంటాడు. అక్కడ కనిపించే దేవి పాత్ర, గ్రామంలో జరుగుతున్న మరణాల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని విక్రమ్ ఎలా చేధించాడు అనేదే కథ.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

విశ్లేషణకు వస్తే, సైన్స్‌కు–భక్తికి మధ్య నడిచే సంఘర్షణ ఆధారంగా ఇంతకు ముందూ సినిమాలు వచ్చినా, మిస్టికల్ థ్రిల్లర్ టచ్‌తో దర్శకుడు కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో ఊరి సమస్యను, భయానక వాతావరణాన్ని బిల్డ్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. రవివర్మ, మీసాల లక్ష్మణ్ పాత్రలు థ్రిల్‌ను పెంచుతాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో ఒక్కొక్క రహస్యాన్ని రివీల్ చేస్తూ కథను ముందుకు నడిపారు. అక్కడక్కడ కథనం ల్యాగ్ అయిన ఫీలింగ్ ఉన్నా, డివోషనల్ మరియు మిస్టికల్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి. పురాణాల టచ్‌తో కథను లాజికల్‌గా చెప్పే ప్రయత్నం బాగుంది.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

నటీనటుల విషయానికి వస్తే, ఆది సాయికుమార్ విక్రమ్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. చాలా కాలం తర్వాత అతనికి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. అర్చన అయ్యర్ దేవి పాత్రలో ఆకట్టుకుంది. మిగతా నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. నేపథ్య సంగీతం సినిమాకి బలంగా నిలుస్తుంది. సినిమాటోగ్రఫీ విజువల్‌గా మంచి అనుభూతిని ఇస్తుంది.

మొత్తంగా “శంబాల” మిస్టికల్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ఒకసారి చూడదగిన అనుభూతిని అందించే సినిమా.

తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5