
మూడేళ్లుగా విడుదలకు నోచుకోకుండా ల్యాబ్ కే అంకితం అయినా ‘ఆరడుగుల బుల్లెట్’ ఎట్టకేలకు ఓటిటి లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు డిసైడ్ అయ్యారు. ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడడం తో చిత్ర నిర్మాతలంతా కూడా తమ సినిమాలను ఓటిటి లో రిలీజ్ చేసి ఎంతోకొంత లాభం ఘటిస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం శుక్రవారం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.
తాజాగా గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ సినిమా కూడా అందులోనే విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మూడేళ్ల క్రితం గోపీచంద్, నయనతార జంటగా సీనియర్ దర్శకుడు బి. గోపాల్ తెరకెక్కించిన సినిమా ‘ఆరడుగుల బుల్లెట్’. అప్పట్లో ఈ సినిమాను విడుదల చేయాలని చాలా ప్రయత్నించినా కూడా కుదర్లేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా బుల్లెట్ థియేటర్స్‌లోకి దిగలేకపోయింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాత తాండ్ర రమేశ్ ప్రయత్నాలు చేస్తున్నాడు.









