
కేంద్రం సడెన్ గా లాక్ డౌన్ ప్రకటించడం తో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. దాదాపు రెండు నెలలు ప్రజలు ఇంటి నుండి బయటకు రాలేదు. ఇప్పుడిప్పుడు కేంద్రం సడలింపులు ఇస్తుండడం తో ప్రజలు బయట తిరుగుతున్నారు.
లాక్డౌన్ వేళ విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్ కింద మన దేశానికి తీసుకొస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే వేలాది మంది భారతీయులు దేశానికి చేరుకున్నారు. అందులో మలయాళ ‘ఆడుజీవితం’ టీమ్ కూడా ఉంది. సినిమా షూటింగ్‌కు కోసం జోర్దాన్‌కి వెళ్లిన ఈ మూవీ టీమ్ ఇటీవలే భారత్‌కి వచ్చింది. అంతేకాదు వీరందరూ 14 రోజుల క్వారంటైన్‌ని పూర్తి చేసుకోసుకున్నారు. అయితే తాజాగా ఈ టీమ్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
జోర్దాన్ భాష ట్రాన్స్‌లేటర్‌గా వెళ్లిన 58ఏళ్ల వ్యక్తితో పాటు మరో టీమ్ మెంబర్‌కి కరోనా సోకినట్లు గురువారం తేలింది. ప్రస్తుతం వీరిద్దరు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాగా బ్లెస్సీ దర్శకత్వం తెరకెక్కిస్తోన్న ‘ఆడుజీవితం’లో ప్రముఖ మలయాళీ నటుడు పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన సరసన అమలాపాల్ రొమాన్స్ చేస్తోంది.









