అనసూయ మనసు పడింది..

తల్లి పోస్ట్ లో ఉన్న కానీ అనసూయ అందాలు మాత్రం రవ్వంత కూడా తగ్గడం లేదు…రోజు రోజుకు అమ్మడు రేంజ్ పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం బుల్లితెర & వెండి తెరపై రాణిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియా లోను మూడున్నర మంది మిలియన్ ఫేస్ బుక్ ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు ఆమెకు సంబందించిన అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. కేవలం సినిమాలే కావు.. సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.

తాజాగా ఈమె వరంగలో జిల్లాలోని కొత్తవాడలోని చేనేత కార్మికులు నేసే దర్సీస్ పై ఈమె మనసు పారేసుకుంది. దర్రీస్ అంటే ఒక రకమైన కార్పెట్లు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో అనసూయ పాల్గొని ఈ కార్పెట్ల తయారినీ మెచ్చుకుంది. ప్రస్తుతం 3 లక్షల కార్పెట్లు వాళ్ల వద్ద స్టాక్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఆమె తన తోటి సినీ నటులు, స్నేహితులతో పాటు ప్రజలందరు కలిసి ఈ కార్పెట్లు కొని వీళ్లను ఆదుకోవాలని పిలుపునిచ్చింది. అంతేకాదు పోచంపల్లి నేత కార్మికుల ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యంతో పాటు.. 5 కిలోల కందిపప్పుతో పాటు కిలో నూనె చొప్పున 40 మందికి అందజేసింది.