మరోసారి సినీ కార్మికులను ఆదుకున్న సీసీసీ

లాక్ డౌన్ కారణంగా సినీ కార్మికుల కష్టాలు అన్ని ఇన్ని కావు..రోజు కూలి చేసుకుని బ్రతికే వారికీ గత మూడు నెలలుగా షూటింగ్ లు బంద్ కావడం తో ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులంతా సీసీసీ చారిటి ద్వారా సాయం అందించగా..తాజాగా మరోసారి వారికీ సాయం అందించారు.

ఈసారి అన్ని అసోసియేన్ల ద్వారా నిత్యావ‌స‌రాల పంపిణీ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని వెల్ల‌డించారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..“నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను తిరిగి పంపిణీ చేయాల్సిన ప‌రిస్థితులున్నాయి. ఇంకా షూటింగులు మొద‌లుకాలేదు. అందువ‌ల్ల‌ ఎవ‌రికీ ప‌నిలేదు. ఇంకా లాక్‌డౌన్ ప‌రిస్థితులే కొన‌సాగుతున్నాయి. అందుకే అంద‌రికీ నిత్యావ‌స‌ర స‌రుకులు ఇవ్వాల‌ని సీసీసీ క‌మిటీలో నిర్ణ‌యించామని. ఇదివ‌ర‌కూ అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.

ఎవ‌రూ బ‌య‌ట‌కు రాలేదు కాబ‌ట్టి, సీసీసీ వాలంటీర్ల ద్వారా ఇళ్ల‌కే వ‌స్తువుల‌ను పంపిణీ చేశాం. క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. నేను స్వ‌యంగా టెస్ట్ చేశాను. టేస్ట్ చేశాను. అంద‌రూ పొదుపుగా వాడుకోండి. మ‌ళ్లీ ప‌నులు ఎప్పుడు అనే ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని త్వ‌ర‌లోనే వింటాం.

తనకి కూడా ప‌ని లేక విసుగ్గా ఉంది, బోర్ కొడుతోంది. అంద‌రి ప‌రిస్థితిని అర్థం చేసుకోగ‌ల‌ను. త్వ‌ర‌లో క‌రోనా మ‌హ‌మ్మారిని అధిగ‌మిద్దాం. అంద‌రూ అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోండి. ప‌ని ముఖ్య‌మే. ప్రాణం అంత‌క‌న్నా ముఖ్యం. పెద్ద‌ల‌ను, చిన్న పిల్ల‌ల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోండి. ఎవ‌రూ అధైర్య‌ప‌డ‌వ‌ద్దు. రోజులు ఎప్పుడూ ఇలాగే ఉండ‌వు. మ‌ళ్లీ అంద‌రం చేతినిండా ప‌నితో ఉంటాం. ఎప్పుడూ సీసీసీ కార్మికుల‌కు అండ‌గా ఉంటుంది“ అని చెప్పుకొచ్చారు.