
గత కొన్ని రోజులుగా చిత్రసీమను మరణాలు వెంటాడుతున్నాయి. రోజుకో ఓ ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తుల గురించి ఏదో ఓ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. ముఖ్యముగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్ గా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకోవడం సంచలనం గా మారింది. ఈ ఘటన నుండి ఇంకా చాలామంది బయటపడలేదు.
ఇక ఇప్పుడు సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ అస్వస్థతకు గురియ్యారనే వార్త అభిమానులు, చిత్రసీమ వ్యక్తులను కలవరపెడుతుంది. సరోజ్ ఖాన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ఒక దవాఖానలో చేరారు. కరోనా వైరస్ ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ వార్త రావడంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే సరోజ్ ఖాన్‌కు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆమెకు నెగెటివ్ గా వచ్చింది.
కొన్ని రోజుల క్రితం ఇదే మాదిరి సమస్య రాగా అప్పుడు కూడా పలు రోజులపాటు చికిత్స తీసుకొన్నారు. గత కొన్నిరోజులుగా సరోజ్‌ఖాన్ తీవ్రమైన శ్వాస సమస్యలను ఎదుర్కొంటున్నారు. తొలుత కుటుంబ సభ్యులు ఆందోళన చెందినప్పటికీ.. ఆమె కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.









