తెలంగాణ లో సోమవారం ఒక్కరోజే 872 పాజిటివ్ కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉదృతి మాములుగా లేదు. సోమవారం ఒక్కరోజే 872 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయంటే అర్ధం చేసుకోవాలి రాష్ట్రంలో ఏ రేంజ్ లో కరోనా ఉందొ ..రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,674కు ఎగబాకింది. కరోనాతో రాష్ట్రంలో మరో ఏడుగురు మరణించారు. దీంతో కొవిడ్-19 మరణాల సంఖ్య 217కు చేరుకుంది. సోమవారం మొత్తం 3189 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు చనిపోయారు. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 713, రంగారెడ్డిలో 107, మేడ్చల్‌లో 16, సంగారెడ్డిలో 12, వరంగల్ రూరల్‌లో 6, మంచిర్యాల 5, కామారెడ్డి, మెదక్‌లో 3చొప్పున, జనగాం, కరీంనగర్, మహబూబాబాబ్లో 2 చొప్పున, వరంగల్ అర్బన్లో ఒక్క కేసులు నమోదయ్యాయి.