దాసరి అరుణ్‌ డిమాండ్‌

దాస‌రి నారాయ‌ణ‌రావు కుమారులు ప్ర‌భు, అరుణ్ కుమార్‌ల మ‌ధ్య ఆస్తి పంచాయ‌తీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయినా సంగతి తెలిసిందే. జూన్ 24 రాత్రి తొమ్మిదిన్న‌ర గంటల స‌మ‌యంలో అరుణ్ గేటు దూకి త‌న ఇంట్లోకి వ‌చ్చిన‌ట్టు ప్ర‌భు ఆరోపిస్తున్నారు. గేటుకు తాళం వేసి ఉండగా… దూకి..ఇంట్లోకి వచ్చిన అత‌ను నన్ను, నా భార్యను, మామయ్యను దుర్భాషలాడినట్లు ప్రభు ఆరోపిస్తున్నారు. దీనిపై జూబ్లీ హిల్స్ పోలీసులను కూడా ప్రభు ఫిర్యాదు చేశారు.

దీనిపై అరుణ్ ప్రభు ను డిమాండ్ చేసారు. ఆ ఇంటికి సంబంధించి అన్నయ్య దగ్గర కోర్టు ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఏ విషయమైనా న్యాయపరంగా వెళ్లాలని కోరుతున్నాని చెప్పారు. మా అన్నయ్య కూడా న్యాయపోరాటం చేయొచ్చని, అందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అన్నయ్యకు ఏమైనా సమస్యలుంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మా ఇల్లు ముగ్గురికీ చెందిందని, అది ఏ ఒక్కరిదీ కాదని తెలిపారు. నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. మాది చిన్న కుటుంబ సమస్య అని, కాస్త మాట్లాడుకుంటే సరిపోతుందన్నారు. అన్నా, సోదరితో తనకు ఎలాంటి వివాదం లేదని చెప్పారు.