పుష్ప కోసం అడవి సెట్

అల వైకుంఠపురం లో చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప మూవీ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రష్మిక హీరోయిన్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. బన్నీ 38 వ పుట్టిన రోజు సందర్భాంగా చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ప్లాన్ ను చేంజ్ చేసినట్లు తెలుస్తుంది. కరోనా లాక్‌డౌన్‌ ముగిసిన తరువాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్న సుకుమార్.. ఎలాంటి బ్రేక్‌లు‌ లేకుండా ‘పుష్ప’ను తెరకెక్కించాలనుకున్నారట.ఈ సినిమా షూటింగ్ కోసం సింహాచలం ఫారెస్ట్ లో భారీ సెట్ వేసి చిత్రీకరణ జరపాలని భావించారు. కాని కరోనా నేపథ్యంలో 50 శాతం వర్కర్స్‌తో సినిమా షూటింగ్ జరపడం అసాధ్యం కాబట్టి కొద్ది రోజుల పాటు చిత్ర షూటింగ్‌ని వాయిదా వేయడమే మంచిదని భావించారు మేకర్స్.

ప్రత్యేకంగా అడవి సెట్ వేసి చిత్రీకరణ జరపాలని మేకర్స్ అనుకుంటున్నారట. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకి వెళ్లి షూటింగ్ చేసే అవకాశం లేనందున మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.