
దేవదాస్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమైన గోవా బ్యూటీ ఇలియానా..మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యం గా యూత్ అయితే అమ్మడి నడుము ఒంపులకు ఫిదా అయ్యారు. దీంతో అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తట్టడం తో అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కానీ ఆ స్థాయి ని నిలుపుకోలేపోయింది.
రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ కు బై బై చెప్పి..మళ్లీ సినిమాల ఫై ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ అమ్మడికి నితిన్ మూవీ ఛాన్స్ వస్తే నో చెప్పిందట. ‘భీష్మ’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న నితిన్ ప్రస్తుతం ‘రంగ్ దే’ సినిమా చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ హిట్ మూవీ ‘అంధాదున్’ తెలుగు రీమేక్‌లో నితిన్ నటించనున్నారు. ఈ సినిమాను మేర్లపాక గాంధీ దర్శకత్వం చేస్తున్నాడు.
హిందీలో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రలో నితిన్ నటిస్తుండగా.. కీలకమైన టబు పాత్ర కోసం దర్శక నిర్మాతలు వేట మొదలుపెట్టారు. మొదట ఈ పాత్ర కోసం హిందీలో చేసిన టుబునే అడిగారట. కానీ, ఆమె అంగీకరించలేదని సమాచారం. ఆ తరవాత రమ్యక్రిష్ణ, అనసూయలను కూడా సంప్రదించారట. వీరు కూడా చేయమని చెప్పినట్టు టాక్. తాజాగా ఇలియానాను కూడా అడిగారట. ఈ ఆఫర్‌కు ఆమె కూడా నో చెప్పారట.
‘అంధాదున్’లో టబుది నెగిటివ్ రోల్. ఇలియానా ఇంకా టాలీవుడ్లో హీరోయిన్గా ట్రై చేద్దామని చూస్తోందట. అలాంటప్పుడు నేను విలన్ రోల్ ఎలా చేయగలనని ఇల్లీ ప్రశ్నించిందట. తాను అప్పుడే అలాంటి పాత్రలు చేయనని, హీరోయిన్ పాత్రలు మాత్రమే చేస్తానని ఆమె స్పష్టం చేసిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.









