సీరియల్ నటిని చంపేసిన సోషల్ మీడియా

ప్రస్తుతం సోషల్ మీడియా హావ ఏ రేంజ్ లో ఉందొ చెప్పాల్సిన పనిలేదు ..ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ను వాడుతున్నారు. దీంతో ఈ మీడియా ద్వారా మంచి ఎంత ఉందొ చెడు కూడా అంతే ఉంది. చాలామంది సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలను వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్రతికున్న వారిని చంపేస్తున్నారు. తాజాగా ప్రముఖ టీవీ నటి జయ భట్టాచార్య చనిపోయిందనే వార్తలు వైరల్ చేయడం తో స్వయంగా ఆమె రంగంలోకి దిగి దీనిపై స్పందించాల్సి వచ్చింది.

. ‘నేను బతికే ఉన్నాను’… కరోనావైరస్ కారణంగా తాను మరణించానని వచ్చిన వార్త అవాస్తవమని జయ భట్టాచార్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పష్టం చేసింది. సరిగ్గా అదే టైంలో ఓ నెటిజన్ పెట్టిన ఈ అబద్ధపు పోస్టుపై రియాక్ట్ అవుతూ తాను బ్రతికే ఉన్నానని..ఎవ్వరైనా సరే పోస్ట్ పెట్టేముందు కాస్త చెక్ చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.