
నేనే మంత్రి నేనే రాజు ..సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన డైరెక్టర్ తేజ..ఆ తర్వాత కాజల్ తో సీత చిత్రాన్ని చేసి భారీ డిజాస్టర్ ను చవిచూశాడు. ఆ తర్వాత రెండు సినిమాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఒకటి ‘అలివేలు వేంకటరమణ’ కాగా రెండోది ‘రాక్షస రాజు.. రావణాసురుడు’.
ఇందులో మొదటి చిత్రమైన ‘అలివేలు వేంకటరమణ’ చిత్రం గురించి రోజూ వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యముగా ఈ మూవీ లో హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తుండటం విశేషం. ముందుగా తేజ లక్కీ గాళ్ అయిన కాజల్ ఈ పాత్ర చేస్తుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత స్వీటీ అనుష్కను ఈ పాత్ర కోసం సంప్రదిస్తున్నారని, దాదాపు గోపీచంద్‌తో ఆమె మరోసారి జోడి కట్టడం ఖాయం అనుకుంటున్న తరుణంలో మళ్లీ సాయిపల్లవి పేరు వినిపించింది. కానీ సాయి పల్లవి గోపితో నటించేందుకు ఇంట్రస్ట్ చూపించకపోవడం తో..రకుల్ ను అనుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఆమె సైతం నో చెప్పడం తో..ప్రస్తుతం తేజ మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ను ఎంపిక చేయాలనీ చూస్తున్నాడు. మరి ఆమె అయినా ఓకే చెపుతుందో లేదో చూడాలి.









