
మహేష్ బాబు ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈయన అడవి శేషు తో మేజర్ అనే సినిమా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే, మరిన్ని సినిమాలను నిర్మించడం కోసం మహేష్ బాబు కథలు వింటున్నారట. తాజాగా మహేష్ బాబు ఒక కథ విన్నారట. ఈ కథ ఆయనకు బాగా నచ్చిందని సమాచారం. ఈ కథలో హీరో పాత్రకు శర్వానంద్ అయితే బాగుంటారని మహేష్ భావిస్తున్నారట. అయితే, మహేష్ టీమ్ ఇంకా శర్వానంద్‌ను సంప్రదించలేదట. ఒకవేళ శర్వానంద్‌ను సంప్రదిస్తే మహేష్ బ్యానర్లో చేయడానికి ఆయన అంగీకరిస్తారో లేదో చూడాలి.









