
గత కొంతకాలం గా హిట్ లేని మంచు విష్ణు..తాజాగా జెఫ్రె చిన్ డైరెక్షన్లో మోసగాళ్లు అనే సినిమా చేస్తున్నాడు . తెలుగు , ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి స్కామ్ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఆ ఐటి స్కామ్ ఏంటి.. ఎవరు చేశారు.. ఎలా చేశారు.. ఎందుకు చేశారు.. దాని వలన ఎవరికీ లాభం వచ్చింది.. స్కామ్ ఎలా బయటకు వచ్చింది అనేది ఈ సినిమా కథ.
ఇప్పటికే చాలా భాగం ఈ చిత్ర షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఐతే లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. లేదంటే ఈ సమయంకల్లా షూటింగ్ అంత పూర్తి అయ్యింది. ఇక తాజాగా సినిమా తాలూకా సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి సినిమా ఫై ఆసక్తి నింపారు. ఈ పోస్టర్ లో కాజల్ , విష్ణు కలిసి ఉన్నట్లు ఉంది.









