ప్రభాస్ కోసం స్క్రిప్ట్ పూర్తి చేసిన నాగ్ అశ్విన్

బాహుబలి తర్వాత ప్రభాస్ స్థాయి ఏ రేంజ్ కు పెరిగిందో చెప్పాల్సిన పనిలేదు. ఆయన రేంజ్ మాత్రమే కాదు ..ఆయన సినిమాలు సైతం బడ్జెట్ పెరిగాయి. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించడం తో దీని బడ్జెట్ ను భారీ గా ప్లాన్ చేసారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం స్క్రిప్ట్ ను పూర్తి చేసాడట. ఇప్పటికే షాట్ డివిజన్ కూడా ప్రారంభించాడు. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. తన గత సినిమా ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు నాగ్ అశ్విన్. ప్రభాస్ చిత్రాన్నికూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.